తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం రేవంత్

 తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించిన సీఎం రేవంత్

హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేటలో  తెలంగాణ తల్లి విగ్రహా తయారీని  పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  అబ్దుల్లా పూర్ మెట్ కు వెళ్లిన సీఎం రేవంత్.. ఔటర్  రింగ్  రోడ్డు దగ్గర తయారు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలించారు.  విగ్రహాన్ని తయారు చేస్తున్న శిల్పిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంటన  ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు  తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.  తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటాన్ని చూసి చలించిన యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. 

Also Read :- రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసా

అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ ప్రకటన చేశారు. సోనియా గాంధీ బర్త్ డే రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత సీమాంధ్ర నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. తర్వాత 2014లో సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా  ఉత్సవాలు నిర్వహించాలని సీఎం సంకల్పించారు.