హైదరాబాద్ : తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులు స్పీడప్ అయ్యాయి. ఈక్రమంలో సచివాలయం వద్ద జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీ లించారు. కూలీలను అప్యాయంగా పలకరిస్తూ.. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నా రు. డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
2009లో డిసెంబర్ 9నే తొలి ప్రకటన
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తొలి ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ స్వరాష్ట్రం కోసం పోరాటాన్ని చూసి చలించిన యూపీఏ ప్రభుత్వం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటి హోంమంత్రి చిదంబరం ఈ ప్రకటన చేశారు. సోనియా గాంధీ బర్త్ డే రోజున తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఒక రూపం వచ్చింది. ఆ తర్వాత సీమాంధ్ర నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆ ప్రకటన కార్యరూపం దాల్చలేదు. తర్వాత 2014లో సోనియా గాంధీ చొరవతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఆ రోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఆవిష్కరించడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం సంకల్పించారు.