హైదరాబాద్ లెక్క వరంగల్ అభివృద్ధి.. సీఎం రేవంత్ రెడ్డి

  • మ‌‌హా న‌‌గ‌‌రంగా ఎదిగేలా ఎయిర్​పోర్ట్​కు రూపకల్పన: సీఎం రేవంత్​
  • టెక్స్‌‌టైల్స్‌‌తో పాటు ఐటీ, ఫార్మా, ఇత‌‌ర ప‌‌రిశ్రమ‌‌ల ఏర్పాటు
  • పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

హైద‌‌రాబాద్‌‌:మ‌‌హాన‌గ‌‌రంగా వ‌‌రంగ‌‌ల్ ఎదిగేలా విమానాశ్రయానికి రూప‌‌క‌‌ల్పన చేయాల‌‌ని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశించారు. ద‌‌క్షిణ కొరియాతోపాటు ప‌‌లు దేశాలు త‌‌మ పెట్టుబ‌‌డుల‌‌కు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయ‌‌ని, ఆయా దేశాల పెట్టుబ‌‌డులు ఆక‌‌ర్షించేలా వ‌‌రంగ‌‌ల్ ఎయిర్​పోర్ట్​ ఉండాల‌‌ని అన్నారు. వ‌‌రంగ‌‌ల్ (మామునూరు) విమానాశ్రయ భూ సేక‌‌ర‌‌ణ‌‌, ఇత‌‌ర ప్రణాళిక‌‌ల‌‌పై గురువారం రాత్రి హైదరాబాద్​లోని ఇంటిగ్రేటెడ్​ కమాండ్​కంట్రోల్​సెంటర్​లో  సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. 

కొచ్చి విమానాశ్రయం అన్ని వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉం టుంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, దానిని ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశీలించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సూచించారు. ఎయిర్​పోర్ట్​కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ అవుట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ రింగు రోడ్డు, రేడియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ రోడ్లు అనుసంధానంగా ఉండాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని తెలిపారు. ఉమ్మడి వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ జిల్లాతోపాటు ఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్మం, క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీంన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్గొండ జిల్లాల ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు భ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విష్యత్తులో ఇక్కడినుంచే రాక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు సాగించేలా ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారుల నిర్మాణానికి  ప్రణాళిక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రూపొందించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆదేశించారు.

 టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఐటీ, ఫార్మా, ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశ్రమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల అభివృద్ధితో హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్క వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఎదిగేలా ప్లాన్స్​ ఉండాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఎయిర్​పోర్ట్​ అందుబాటులోకి వస్తే మేడారం జాత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్నవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రం, రామ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్ప, ఇత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్యాట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క ప్రదేశాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చే టూరిస్టులు సైతం దానిని వినియోగించుకుంటార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం తెలిపారు.

 స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీక్షలో  మంత్రులు కోమ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టిరెడ్డి వెంక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్ రెడ్డి, కొండా సురేఖ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీతక్క సీఎం స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాదారు వేం న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రేంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ రెడ్డి, నాగార్జున సాగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ ఎమ్మెల్యే కె.జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీర్ రెడ్డి, ప్రభుత్వ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాదారు (మౌలిక వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తులు) శ్రీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నివాస‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాజు, సీఎస్​ శాంతి కుమారి, ఆర్ అండ్ బీ ప్రత్యేక ముఖ్య కార్యద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్శి వికాస్ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టర్ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్య శార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ ఆర్డీవో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్యపాల్ రెడ్డి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు !

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు అయినట్లు తెలిసింది.  ఈ నెల 14, 15, 16 తేదీల్లో ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయ ప్రారంభో త్సవ కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి హాజ రు కావాలని సీఎం నిర్ణయించుకున్నట్లు సమాచా రం.  ఆ తరువాత    17న సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు.  అక్కడ షాపింగ్ మాల్స్, స్పోర్ట్స్ స్టేడియాల నిర్మాణాలను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. 

 సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరగనున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని దావోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు సీఎం టీమ్​ వెళ్తుంది. 23 వరకు దావోస్​లోనే ఉండనున్నారు.  ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు 5 రోజుల పాటు దావోస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం’ 55వ వార్షిక సదస్సు జరగనుంది.

నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సెక్రటేరియెట్​లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు జిల్లాల్లో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ నెల 4వ తేదీన జరిగి న కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు, 26వ తేదీ నుంచి అమలు చేయనున్న పథకాలపై కలెక్టర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు.

 రైతు భరోసాకు సంబంధించి వ్యవసా య యోగ్యం కాని భూములను గుర్తించడం, ఇందిరమ్మ ఇండ్ల మొదటి విడత లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేయడం వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డుల జారీ, భూమి లేని వ్యవసాయ రైతు కూలీ కుటుంబాల గుర్తింపుతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్లకు సీఎం పలు సూచనలు చేయనున్నట్లు తెలిసింది.

పంచాయతీ ఉద్యోగులకు టైమ్​కు జీతాలివ్వాలి

గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు చెల్లించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే చెల్లింపులు ఉండాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 92,351 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు. వీరికి ప్రతినెలా రూ.116 కోట్లు జీతాల కింద చెల్లించాల్సి వస్తున్నదన్నారు. 

ఇకనుంచి శాలరీల చెల్లింపులు లేట్ చేయొద్దని పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సంద ర్భంగా రేవంత్ మాట్లాడారు. ‘‘ఇక నుంచి ప్రభు త్వ ఉద్యోగుల జీతాలతోపాటు గ్రామస్థాయి ఉద్యోగులకూ గ్రీన్ చానెల్​లో శాలరీలు చెల్లించాలి. 

ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో లేట్ చేయొద్దు. నిరుడు ఏప్రిల్ నుంచి దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయి. వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలి. కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు.. ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించే లా చర్యలు తీసుకోవాలి’’అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

ఉపాధి హామీ, ప్రధా న మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ సలహా దారులు కే.కేశవ రావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ రాలే

సీఎం నిర్వహించిన సమీక్షలో పంచాయతీ ఎన్నికలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే దానిపై  మీటింగ్​లో స్పష్టత రాలేదు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఇంకా డెడికేటెడ్​కమిషన్ నుంచి  నివేదిక ఫైనల్​ కాలేదు. దీంతో కమిషన్ నివేదిక తర్వాత చర్చిద్దామని సీఎం అన్నట్లు తెలిసింది.