‘భూభారతి’ అమ‌‌‌‌‌‌‌‌లు బాధ్యత అధికారుల‌‌‌‌‌‌‌‌దే...రెవెన్యూ సంఘాల నేత‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

‘భూభారతి’ అమ‌‌‌‌‌‌‌‌లు బాధ్యత అధికారుల‌‌‌‌‌‌‌‌దే...రెవెన్యూ సంఘాల నేత‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • టీజీటీఏ, టీజీఆర్ఎస్ఏ డైరీల ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: కొత్త ఆర్వోఆర్ చట్టంగా భూభా ర‌‌‌‌‌‌‌‌తి త్వర‌‌‌‌‌‌‌‌లోనే అమ‌‌‌‌‌‌‌‌ల్లోకి రానుంద‌‌‌‌‌‌‌‌ని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. భూభార‌‌‌‌‌‌‌‌తి రాక‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలోని రైతుల‌‌‌‌‌‌‌‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి వ‌‌‌‌‌‌‌‌స్తాయ‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. కొత్త చ‌‌‌‌‌‌‌‌ట్టంతోనే భూ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌రిష్కారం ల‌‌‌‌‌‌‌‌భిస్తుంద‌‌‌‌‌‌‌‌ని పేర్కొన్నారు. తెలంగాణ త‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌సీల్దార్స్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌(టీజీటీఏ), తెలంగాణ రెవెన్యూ స‌‌‌‌‌‌‌‌ర్వీసెస్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌(టీజీఆర్ఎస్ఏ) నూత‌‌‌‌‌‌‌‌న సంవ‌‌‌‌‌‌‌‌త్సర డైరీలను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు.

ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌,  డిప్యూటీ క‌‌‌‌‌‌‌‌లెక్టర్స్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్ అధ్యక్షుడు వి.ల‌‌‌‌‌‌‌‌చ్చిరెడ్డితో భూభారతి చ‌‌‌‌‌‌‌‌ట్టం, అందులోని ప్రధాన అంశాల గురించి సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి చ‌‌‌‌‌‌‌‌ర్చించారు. ధ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణితో రాష్ట్రంలో భూ స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యలు పెరిగాయ‌‌‌‌‌‌‌‌ని ఈ సంద‌‌‌‌‌‌‌‌ర్భంగా ఆయన పేర్కొన్నారు. ‘‘రైతుల‌‌‌‌‌‌‌‌కు రెవెన్యూ సేవ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను వేగంగా, సుల‌‌‌‌‌‌‌‌భంగా అందించే ల‌‌‌‌‌‌‌‌క్ష్యంతోనే భూభార‌‌‌‌‌‌‌‌తిని తీసుకొస్తున్నం.

జిల్లా స్థాయిలోనే అన్ని ర‌‌‌‌‌‌‌‌కాల భూస‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్యల‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌రిష్కారం ల‌‌‌‌‌‌‌‌భించే విధంగా కొత్త చ‌‌‌‌‌‌‌‌ట్టం ఉంటుంది. ఈ చ‌‌‌‌‌‌‌‌ట్టాన్ని ప్రజ‌‌‌‌‌‌‌‌ల్లోకి తీసుకెళ్లి, స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ర్థవంతంగా అమ‌‌‌‌‌‌‌‌లు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల మీద‌‌‌‌‌‌‌‌నే ఉంది. భూభార‌‌‌‌‌‌‌‌తిలో క‌‌‌‌‌‌‌‌ల్పించిన అధికారాల వికేంద్రీక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌తో క్షేత్రస్థాయిలోనే రైతుల‌‌‌‌‌‌‌‌కు కావాల్సిన రెవెన్యూ సేవ‌‌‌‌‌‌‌‌లు అందుబాటులోకి వ‌‌‌‌‌‌‌‌స్తాయి. ప్రతి గ్రామంలోనూ ఒక రెవెన్యూ అధికారి ఉండేలా చూస్తున్నం” అని చెప్పారు. 

త‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌సీల్దార్ల బ‌‌‌‌‌‌‌‌దిలీలు చేప‌‌‌‌‌‌‌‌ట్టండి: ల‌‌‌‌‌‌‌‌చ్చిరెడ్డి

రాష్ట్రంలో ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల స‌‌‌‌‌‌‌‌మయంలో త‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌సీల్దార్లను వివిధ జిల్లాల‌‌‌‌‌‌‌‌కు బ‌‌‌‌‌‌‌‌దిలీ చేశార‌‌‌‌‌‌‌‌ని సీఎం దృష్టికి వి.లచ్చిరెడ్డి తీసుకెళ్లారు. ఎన్నిక‌‌‌‌‌‌‌‌ల స‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌యంలో బ‌‌‌‌‌‌‌‌దిలీ అయిన త‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌సీల్దార్లను ఇప్పటి వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు సొంత జిల్లాల‌‌‌‌‌‌‌‌కు బ‌‌‌‌‌‌‌‌దిలీ చేయ‌‌‌‌‌‌‌‌లేద‌‌‌‌‌‌‌‌ని చెప్పారు. దీంతో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బదిలీలు చేపట్టాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం.. సాధ్యమైనంత త్వర‌‌‌‌‌‌‌‌గా బ‌‌‌‌‌‌‌‌దిలీల ప్రక్రియ చేపడతామని తెలిపారు.

కార్యక్రమంలో డిప్యూటీ క‌‌‌‌‌‌‌‌లెక్టర్స్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్ ప్రధాన కార్యద‌‌‌‌‌‌‌‌ర్శి కె.రామ‌‌‌‌‌‌‌‌కృష్ణ, తెలంగాణ త‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌సీల్దార్స్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్ రాష్ట్ర అధ్యక్ష, కార్యద‌‌‌‌‌‌‌‌ర్శులు ఎస్‌‌‌‌‌‌‌‌.రాములు, ర‌‌‌‌‌‌‌‌మేశ్ పాక‌‌‌‌‌‌‌‌, సెక్రట‌‌‌‌‌‌‌‌రీ జ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ల్ పూల్‌‌‌‌‌‌‌‌సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌, శ్రీ‌‌‌‌‌‌‌‌నివాసులు, తెలంగాణ రెవెన్యూ స‌‌‌‌‌‌‌‌ర్వీసెస్ అసోసియేష‌‌‌‌‌‌‌‌న్ రాష్ట్ర అధ్యక్ష, కార్యద‌‌‌‌‌‌‌‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, మ‌‌‌‌‌‌‌‌హిళా అధ్యక్షురాలు సుజాత‌‌‌‌‌‌‌‌ చౌహాన్‌‌‌‌‌‌‌‌, మ‌‌‌‌‌‌‌‌ల్లేశ్ త‌‌‌‌‌‌‌‌దిత‌‌‌‌‌‌‌‌రులు పాల్గొన్నారు.

భూభారతికి ట్రెసా మద్దతు.. 

త్వరలో రానున్న భూభారతి చట్టానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డిని ట్రెసా ప్రతినిధులు కలిశారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి తెలిపారు.

గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రెసా ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్ కుమార్, ఉపాధ్యక్షులు కె.నిరంజన్ రావ్, దేశ్యా నాయక్, నాగమణి, జాయింట్ సెక్రటరీ డి.వాణిరెడ్డి పాల్గొన్నారు.