
అలంపూర్,వెలుగు : ఐదో శక్తి పీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలతో పాటు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి జరగనున్న సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పాలకమండలి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఈవో పురేందర్, ఆలయ అర్చకులు ఆనంద్ శర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వార్షిక బ్రహ్మోత్సవాలకు కలిశారు.
వసంత పంచమి సందర్భంగా సోమవారం మూడో తేదీ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని సీఎంకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అర్చకులు పాల్గొన్నారు.