కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు రండి

కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు రండి
  • సీఎం రేవంత్​రెడ్డిని ఆహ్వానించిన ఆలయ కమిటీ

కీసర, వెలుగు: ఈ నెల 24 నుంచి ఆరు రోజుల పాటు కొనసాగే కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు కుటుంబ సమేతంగా హాజరుకావాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్​నియోజకవర్గ కాంగ్రెస్​ఇన్​చార్జ్​తోటకూర వజ్రేష్​యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు సీఎం రేవంత్​రెడ్డిని ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం సిటీలోని నివాసంలో సీఎంను కలిసి ఇన్విటేషన్​అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎంను కలిసిన వారిలో ఆలయ చైర్మన్ తటాకం నారాయణశర్మ, ఈఓ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నేత కందాడి అంజి రెడ్డి, ఆలయ నిర్వాహకులు తటాకం రమేశ్​శర్మ, ఉమాపతి శర్మ, వెంకటేశ్ శర్మ, సాయిలు, ముత్యాలు, నల్ల మధుసూదన్ రెడ్డి ఉన్నారు.