సీతారాముల కల్యాణానికి రండి

సీతారాముల కల్యాణానికి రండి
  • సీఎం రేవంత్ ​రెడ్డికి భద్రాచల దేవస్థానం ఆహ్వానం

భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారాముల కల్యాణానికి రావాలని సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం అందింది.  ఈ మేరకు  దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామన్​ అయ్యర్, ఈవో రమాదేవి, భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం అర్చకులు ఆదివారం ఆహ్వాన పత్రికలను సీఎంకు అందజేశారు. సీఎం రేవంత్​తోపాటు డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఆహ్వానించారు. అంతకుముందు అర్చకులు సీఎం రేవంత్​రెడ్డికి వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.

దేవస్థానం వేదపండితుడు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు రచించిన తెలుగు కావ్య ప్రబంధ కథలు గ్రంథాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. తెలుగు భాషలో ప్రసిద్ధి పొందిన కవులు రచించిన కావ్యాలు, ప్రబంధాల కథలు ఈ గ్రంథంలో ఉన్నాయి.