హైదరాబాద్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, పెండింగ్ నిధులకు సంబంధించిన విషయాలపై డిస్కస్ చేసేందుకు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించాలని కేంద్రమంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ALSO READ | హింసతో ఏదీ సాధించలేం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణకు సంబంధించిన వివరాలను ఖట్టర్‌కు వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఖట్టర్‌తో భేటీకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన తెలంగాణకు వరద సహయం పెంచి త్వరగా అందించాలని రేవంత్ అమిత్ షాను కోరారు. దీంతో పాటు సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాలను పరిష్కారించాలని విజ్ఞప్తి చేశారు.