హైదరాబాద్:తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణబిడ్డ, మాజీప్రధాని ఆర్థిక మేధావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహారావు కు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిది అని అన్నారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్ కేఅద్వానీ, కర్పూరీ ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారత రత్న రావడం సంతోషకరమన్నారు సీఎం రేవంత్రెడ్డి.
పీవీకి భారత రత్న దక్కడం పట్ల డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుప్పకూల బోతున్న భారత్ ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ ను రూపొందించడంలో స్వర్గీయ పీవీ నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరల పునాదుల ఫలితంగానే ఇవాళ భారత్ దేశం ప్రపంచంలోనే ఆర్థికంగా నాలుగవ బలమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు డిప్యూటీ సీఎం.
ALSO READ :- శివబాలకృష్ణ ల్యాండ్ స్కాంలో.. ఐఏఎస్ అరవింద్ కుమార్
గొప్ప రాజనీతిజ్ణుడు, బహుభాషా కోవిదుదు తెలంగాణ రాష్టానికి చెందిన పీవీకి భారత రత్న దక్కడం .. కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా భావిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మా పోరాటాన్ని సుదీర్థక కాలం తర్వాత గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు అన్నారు భట్టీ.