- సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీల సమస్యలపై స్పందించడం హర్షనీయం
ఆదిలాబాద్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదివాసీలకు ఒరిగిందేమీ లేదని, మాయమాటలతో మభ్యపెట్టి మోసగించారని మాజీ ఎంపీ , కాంగ్రెస్ నేత సోయం బాపురావు అన్నారు. శనివారం క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై సానుకూలంగా స్పందించడం హర్షనీయమన్నారు.
ఎన్నో ఏండ్లుగా ఆదివాసులు తమ హక్కులు, సమస్య పరిష్కారం కోసం సుదీర్ఘమైన పోరాటం, ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఆదివాసీల గురించి ఏ సీఎం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మొదటిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, పెద్దలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించడం, వారితో చర్చించడం అభినందనీయమన్నారు. మాజీ జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, నాయకులు లోక ప్రవీణ్‍రెడ్డి, బాబన్న, శ్రీలేఖ, మోహన్ పాల్గొన్నారు.