ఒకేసారి రూ. లక్ష రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

ఒకేసారి రూ. లక్ష రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్  పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఒకేసారి రూ. లక్ష  రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటుందని.. గత ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఆ పార్టీ నాయకులకే ఇచ్చేవారని అన్నారు. 

అనంతరం కాంగ్రెస్ యూత్ నాయకుడు సంతోష్ యాదవ్ తలపెట్టిన స్కూల్ విద్యార్థులకు బుక్స్  పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్,  రెజిమెంటల్ బజార్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.