
రేగొండ, వెలుగు: ఈ నెల 30న సీఎం రేవంత్రెడ్డి భూపాలపల్లి లో జనజాతర సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఆయా పనులను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యవేక్షిస్తున్నారు. పరకాల, భూపాల పల్లి నియోజకవర్గాల నుంచి 50 వేల మంది సభ కు తరలించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సభకు పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు చేపట్టారు. సీఐ దగ్గు మల్లేశ్ యాదవ్, రేగొండ ఎస్సై రవికుమార్భద్రతా పరమైన చర్యలు తీసుకుంటున్నారు.