సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ షెడ్యూల్ ఖరారు

సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ షెడ్యూల్ ఖరారు

సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేశారు అధికారులు. దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉంటారు సీఎం రేవంత్. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తు్న్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది.

సీఎం ఏప్రిల్ నెలలో జపాన్ పర్యటనకు వెళ్తారు. ఎప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ పర్యటన కు వెల్లనున్నారు. ఎప్రిల్ 15 లోపు డీ లిమిటేషన్ పై హైదరాబాద్ లో రెండో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి.. అక్కడి నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 

ALSO READ | 72 గంటలు టైం ఇస్తున్నా.. బాలకృష్ణ, విజయ్ దేవరకొండను అరెస్ట్ చేయండి: కేఏ పాల్