‘కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగింది ఏంటి? వాళ్లు ఇచ్చింది ఏంటి?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన సమావేశంలో చర్చించారు. అంతకుముందు మంత్రులతో ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంపై స్పీడ్ పెంచడంతోపాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడలే: కేటీఆర్
‘జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్ తో రుజువైంది. రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది సున్నా’ (కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్)
డ్రీమ్ బడ్జెట్ : కిషన్ రెడ్డి
పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల సంక్షేమానికి బాటలు వేస్తూనే.. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే ‘డ్రీమ్ బడ్జెట్’ ఇది.వ్యక్తిగత ఇన్ కమ్ టాక్స్ పరిధిని 12 లక్షలకు పెంచడం చాలా పెద్ద నిర్ణయం. ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ధన్యవాదాలు. (కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి)
గాడిద గుడ్డు ఇచ్చింది: మహేశ్ కుమార్ గౌడ్
రాష్ట్రానికి కేంద్రం ఈ బడ్జెట్ లో గాడిద గుడ్డే ఇచ్చింది. తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఈ బడ్జెట్ కేవలం బీహార్ ఎన్నికల కోసమే పెట్టినట్టుంది. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ ను ఉపయోగించుకుంది. (మహేశ్ కుమార్ గౌడ్, పీసీసీ చీఫ్)