మనుసులో మాట బయట పడేది ఈదుల్లోనే : సీఎం రేవంత్ రెడ్డి

మనుసులో మాట బయట పడేది ఈదుల్లోనే : సీఎం రేవంత్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా లష్కర్ గూడలో ఆదివారం జరిగిన సభలో కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మనుసులో ఏ మాట ఉన్నా అది గౌడన్న ముందు ఈదుల్లోనే బయట పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకటో ముంతకు కాకున్నా రెండొవ ముంతకైనా మనసులో మాట తాళ్లల్ల బయటకు వస్తుందని సభలో జనాల్ని నవ్వించారు సీఎం రేవంత్ రెడ్డి. 

గౌడన్నలు పౌరుషానికి, పోరాటాని ప్రతిక అని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో గౌడన్నలు కీలక పాత్ర పోషించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గౌడ సామాజిక వర్గం చేసిన కృషి గొప్పదని సీఎం అన్నారు. సభ అనంతరం సీఎం గీతకార్మికులతో సహపంక్తి భోజనాలు చేయనున్నారు.

తాటి చెట్టు నుంచి గీతకార్మికులు జారి పడకుండా, కింద పడినా ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మోకులను కాటమయ్య రక్షణకవచం కిట్లను గౌడన్నలకు అందించారు రేవంత్ రెడ్డి. చెట్టు పై నుంచి జారినా కిందపడకుండా ఉండేలా ఈ మోకులు తయారు చేశారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గీత కార్మికులకు సేఫ్టీ మోకుల పంపిణీ చేస్తామన్నారు. 

కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇచ్చామని ఆయన అన్నారు. పొన్నం ప్రభాకర్ గౌడ్ కు మంత్రి పదవి,  MLCగా మహేష్ గౌడ్, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి శ్రీకాంత్ గౌడ్ కు, కాంగ్రెస్ పార్టీ కాంపెయిన్ కమిటీ ఛెర్మెన్ గా మధుయాష్కీ గౌడ్ ను నియమించామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర అభివృద్ధిలో గౌడన్నల పాత్ర మరవలేనిదని ఆయన అన్నారు. తాటి, ఈత వనాలను పెంచాలని గీతకార్మికులు ఆయనని కోరారని తెలిపారు. తప్పుకుండా గ్రామాల్లో ఖాళీగా ఉన్న భూముల్లో, మిషన్ భగీరథ చెరువు గట్లపై, వనమహోత్సవంలో ఈత చెట్లు, తాటి చెట్లు పెంచేవిధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ALSO READ | కాటమయ్య రక్షణ కవచం ప్రారంభించిన సీఎం రేవంత్

ప్రమాదాల నుంచి రక్షణకు కాటమయ్య రక్షణకవచం ఉపయోగపడుతుందని వివరించారు. కులవృత్తుల కుటుంబాలు ఆర్థికంగా బలపడాలని, కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పిలుపునిచ్చారు. బలహీన వర్గాల వారు పాలకులుగా మారాలంటే చదువే ఆయుధమని చెప్పారు.