ఉస్మానియా కొత్త ఆస్పత్రికి సీఎం రేవంత్ భూమి పూజ

ఉస్మానియా కొత్త ఆస్పత్రికి సీఎం రేవంత్ భూమి పూజ

హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్ లో  కొత్త ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్​కు  సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ శాంతికుమారి,  మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ,ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉస్మానియా హాస్పిటల్ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం జరగనుంది. రాబోయే వందేండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని 26 ఎకరాల విస్తీర్ణంలో, రెండువేల బెడ్స్ సామర్థ్యంతో ఈ కొత్త హాస్పిటల్ ను నిర్మించనున్నారు. పాత హాస్పిటల్ లో లేని అధునాతన సౌకర్యాలను ఈ కొత్త హాస్పిటల్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. రూ.2,400 కోట్లతో 14 అంతస్తుల్లో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం 

90 డయాలసిస్, హిమోఫిల్ట్రేషన్​ సీఆర్ఆర్​టీ మెషిన్లు, 500 బెడ్లతో కూడిన ఐసీయూలు, అత్యాధునిక టెక్నాలజీ, వసతులతో కూడిన మార్చురీ, ప్రతి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్ ఆపరేటివ్ వార్డులు అందుబాటులో రానున్నాయి. కిడ్నీ, లివర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్కిన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ల కోసం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లాంటేషన్ విభాగం అందుబాటులోకి రానుంది. ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటాయి.