అపాయింట్మెంట్ కోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

అపాయింట్మెంట్ కోసం ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. బీసీ రిజర్వేషన్లు పెంపు బిల్లుకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రవేశపెట్టిన బిల్లును(మార్చి 17) శాసన సభ  ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై చర్చ సందర్బంగా మాట్లాడిన రేవంత్..  50% రిజర్వేషన్లు మించొద్దనే నిబంధన ఉందని, దానిపై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమని   అన్నారు. ఇందుకోసం మనందరం పార్టీలకు అతీతంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుద్దామని సీఎం చెప్పారు.

ALSO READ | తెలంగాణ టీమ్ చెన్నై వెళ్తుంది.. చివరకు అందరం ఒక్క చోట కలుస్తాం: జానా రెడ్డి

 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ ఇప్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పార్లమెంటులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలుద్దామని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నించాలని కోరారు. ఈ క్రమంలోనే రేవంత్ మోదీకి లేఖ రాశారు