
ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల హైట్ తో విధులు నిర్వహిస్తున్న కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతడికి ఆర్టీసీ డిపార్ట్ మెంలో వేరే ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ లో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అతడికి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఆదేశించారు పొన్నం.
అమీన్ అహ్మద్ అన్సారీ హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేశారు. ఆయన అనారోగ్యంతో 2021లో మరణించగా కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తిచేసిన అన్సారీకి మెహిదీపట్నం డిపోలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం సవాల్ గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది.
ALSO READ | గుడ్ న్యూస్...ఈ వారంలోనే మీ అకౌంట్లో ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు
195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్సారీ వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ప్రయాణికులు సూచించారు. ఈ క్రమంలోనే అతడికి వేరే ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు అతనికి సరైన మరో ఉద్యోగం ఆర్టీసీ లో ఇవ్వగలరు @SajjanarVC గారికి ఆదేశం
— Ponnam Prabhakar (@Ponnam_INC) April 6, 2025
- మీ పొన్నం ప్రభాకర్ https://t.co/zadYYAMYhM