
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంఐఎం ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. డిసెంబర్ 12వ తేదీ మంగళవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సారధ్యంలో ఏడుగురు ఎంఐఎం ఎమ్మెల్యేలు.. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై పాతబస్తీ, మూసీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడంతో ఆసక్తి నెలకొంది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనతో దూకుడు చూపిస్తున్నారు. అన్ని శాఖలపై వరుస రివ్యూలు నిర్వహిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో ఎంఐఎం పార్టీ సన్నిహితంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి.. ఎంఐఎం పూర్తి సహకారాలు అందించింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. బీఆర్ఎస్ కు ఎంఐఎం గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్టన్లు తెలుస్తోంది.