మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ.. చర్చ ఈ అంశాలపైనేనా

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ.. చర్చ ఈ అంశాలపైనేనా


మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఈ భేటీలో కారారు. సత్యనాదెళ్ల సోమవారం (30 డిసెంబర్ 2024) అమెరికా నుంచి హైద్రాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవోను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీతో పాటు ఫ్యూచర్ సిటీ గురించి వివరించినట్లు తెలుస్తోంది. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని కోరినట్లు తెలుస్తోంది.

తెలంగాణ, హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ తదితర అంశాలపై చర్చ జరిగింది. అమెరికా తర్వాత హైద్రాబాద్ లోనే అతిపెద్ద క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 6 డాటా సెంటర్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ప్రకటించారు. ఈ 6  డాటా సెంటర్ల ఏర్పాటుకు రూ.32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. 

ALSO READ | ఈ కొత్త టెక్నాలజీతో 10 లక్షల జాబ్స్ .. సాలరీ ఎంతో తెలుసా?

ఇక మైక్రోసాఫ్ట్ రంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల మైక్రోసాఫ్ట్ డాటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం  మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు,
చందన్‌వల్లిలో 52 ఎకరాలను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. ఒక్కో డేటా కేంద్రం 100 మెగావాట్ల ఐటీలోడ్‌ ఉండనుంది. డేటా సెంటర్ల పనులు 70శాతం పూర్తయ్యాయి. మిగతా  పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానానికి చేరుకోనుంది.

సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శంతకుమారి సత్యనాదెళ్లను కలిశారు.