మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు రండీ.. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం

మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు రండీ.. రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ ఆహ్వానం

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. ఇవాళ (ఫిబ్రవరి 15) రాహుల్ గాంధీని కలిసిన రేవంత్.. కులగణన సక్సెస్ గురించి వివరించారు. తెలంగాణలో కులాల వారిగా జనాభా లెక్కలను, కులగణను విజయవంతంగా పూర్తి చేసిన విధానాన్ని వివరించారు.

 సోనియాగాంధీ ఇంట్లో జరిగిన భేటీలో మెదక్ ఎస్సీ వర్గీకరణ సభకు రావాలని రాహుల్ గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్. అదేవిధంగా సూర్యాపేటలో జరిగే భారీ బహిరంగ సభకు రావాల్సిందిగా కోరారు.

ఆ తర్వాత ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో భేటీ కానున్నారు సీఎం. తెలంగాణలో కులగణన సక్సెస్, ప్రభుత్వ పనితీరు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.