హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం భేటీ కానున్నారు. ఉదయం ఢిల్లీకి వెళ్లనున్న ఇద్దరు నేతలు.. ప్రధానితో మీటింగ్ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై కొన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. సీఎంగా రేవంత్, డిప్యూటీగా భట్టి బాధ్యతలు చేపట్టాక ప్రధాని మోదీని కలవడం ఇదే మొదటిసారి.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వాన్ని కూడా రేవంత్, భట్టి కలవనున్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు, కొత్త పీసీసీ చీఫ్ నియామకం, ఎమ్మెల్సీ పదవుల భర్తీ, కేబినెట్‌లో మిగిలి ఉన్న మరో ఆరు బెర్తులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పర్యటన తర్వాత వారిద్దరూ నాగపూర్‌కు వెళ్లనున్నారు. గురువారం అక్కడ జరిగే కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ టూర్ నేపథ్యంలో మంగళవారం నాటి ఖమ్మం పర్యటనను భట్టి రద్దు చేసుకున్నారు.