రామోజీరావుతో సీఎం రేవంత్​ రెడ్డి భేటీ

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదిలాబాద్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం నేరుగా ఫిల్మ్ సిటీకి వెళ్లారు.

రామోజీతో గంటకు పైగా వివిధ అంశాలను చర్చించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న తీరు, మారిన ప్రజాపాలన విధానాలపైనా మాట్లాడుకున్నారు. ఈ భేటీలో సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, ఈనాడు ఎండీ కిరణ్ ఉన్నారు.