సీఎంను కలిసిన కరీంనగర్​ ముఖ్యనేతలు

కరీంనగర్ సిటీ/కోరుట్ల, వెలుగు :  రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా హైదరాబాద్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి  అధ్యక్షతన  మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యనేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీటింగ్‌‌లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

విప్‌‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మేడిపల్లి సత్యం, విజయరమణారావుతోపాటు కరీంనగర్ హుజురాబాద్ నియోజకవర్గాల ఇన్‌‌చార్జిలు పురుమల్ల శ్రీనివాస్, వొడితల ప్రణవ్ , జువ్వాడి నర్సింగరావు, కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.