ఢిల్లీ, హర్యానా తరహాలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముసాయిదా సిద్ధం చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియేట్ లో స్కిల్ వర్సిటీ అధికారులతో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సుదీర్ఘంగా చర్చించారు. ముసాయిదాలోని అంశాలపై పలు సూచనలు జారీ చేశారు. యూనివర్సిటీల్లో సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులకు సంబంధించి..సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించారు అధికారులు.
కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై దృష్టిపెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తైన విద్యార్థులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి కంపెనీలతో ముందుగానే మాట్లాడాలని సూచించారు. స్కిల్ వర్సిటీ విషయంలో రాజీపడొద్దన్న రేవంత్.. పూర్తిస్థాయి ముసాయిదాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.