నిరుద్యోగులకు మేలు చేస్తాం.. సీఎం రేవంత్ హామీ

నిరుద్యోగులకు మేలు చేస్తాం.. సీఎం రేవంత్ హామీ

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కృతనిశ్చయంతో ఉన్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తులకు నిరుద్యోగులు బలి కావొద్దని సూచించారు.  గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతూ ముందుకెళ్తున్నామని చెప్పారు. గత సర్కార్ లా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉందన్నారు సీఎం రేవంత్. ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు.

 ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నింటిని అధిగమించిందని చెప్పారు.  జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు సీఎం.  నిరుద్యోగుల సమస్యలపై నేతలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారంపై CS, అధికారులతో సీఎం చర్చించారు.