ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎం ప్రజావాణి ప్రారంభం

 ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎం ప్రజావాణి ప్రారంభం

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లాలో పైలట్​ప్రాజెక్టుగా సీఎం రేవంత్​రెడ్డి, జిల్లా ఇన్​చార్జ్​ మంత్రి సీతక్క  ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీఎం ప్రజావాణి కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఏ సమస్య ఉన్నా ఈ ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకోవచ్చని.. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. 

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో పైలట్​ ప్రాజెక్టుగా ప్రారంభించిన సీఎం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్​ జిల్లా అధికార ప్రతనిధి పసుల చంటి కోరారు. సోమవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమ న్నారు. సమావేశంలో పార్టీ నేత పోతన్న పాల్గొన్నారు.