కేరళ ఏఐసీసీ కార్యదర్శి కూతురి పెళ్లి..హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

కేరళ ఏఐసీసీ కార్యదర్శి కూతురి పెళ్లి..హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

హైదరాబాద్, వెలుగు : కేరళలోని ఎర్నాకులమ్​లో శనివారం​ ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ కూతురి పెండ్లి రిసెప్షన్​ జరిగింది.ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్​ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు అటెండ్ ​అయ్యారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో సీఎంతో పాటు మంత్రులు దామోదరరాజ నర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్,సీఎం సలహాదారు వేంనరేందర్ రెడ్డి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎంకు అక్కడ సాదరస్వాగతం లభించింది.  ప్రభుత్వ అడ్వయిజర్​ హర్కర వేణుగోపాల్​తో పాటు ఇతరులు కూడా వేడుకలో పాల్గొన్నారు.