
డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలు హక్కులు కోల్పోతాయన్నారు సీఎం రేవంత్. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్.. నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్ కు అన్యాయం చేయొద్దన్నారు. జనాభా ప్రతిపాదికన పునర్విభజన చేస్తే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయన్నారు. జనాభా ప్రాతిపాదికన కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని డీలిమిటేషన్ చేయాలన్నారు రేవంత్. అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు. అన్ని పార్టీలు కలిసి డీలిమిటేషన్ పై కేంద్రంతో ఫైట్ చేద్దామన్నారు రేవంత్.
రేవంత్ కీలక కామెంట్స్..
- ప్రస్తుతం ఉన్న నియోజక వర్గాలనే కొనసాగించాలి
- రాష్ట్రాలకు అంతరం రావొద్దనే మాజీ ప్రధాని ఇందిర రాజ్యాంగ సవరణ చేశారు
- తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలి
- జనాభా నియంత్రణ దక్షిణాదికి శాపం కాకుడదు
- పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రమాణికం కాకూడదు
- జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు
- రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని పునర్విభజన చేయాలి
- ప్రస్తుత జనాభా ప్రతిపాదికన ఎస్సీ,ఎస్టీ సీట్లు పెంచాలి
- కేంద్రం డీలిమిటేషన్ ను దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయంగా వాడుతుంది
- డీలిమిటేషన్ పై కేంద్రం రాష్ట్రాలను సంప్రదించకపోవడం సరికాదు
- లోక్ సభలో సౌత్ ప్రాతినిధ్యం 24 శాతమే
- డీలిమిటేషన్ తో సౌత్ రాష్ట్రాల ప్రాతినిధ్యం 19 శాతానికి చేరుతుంది
- డీలిమిటేషన్ అనేది లిమిటేషన్ ఫర్ సౌత్ గా మారుతుంది.
- డీలిమిటేషన్ తో సౌత్ రాష్ట్రాల హక్కులు కోల్పోయే ప్రమాదం
- డీలిమిటేషన్ పై కేంద్ర మంత్రుల వాదనలు అర్థ రహితం
- డీలిమిటేషన్ పై నష్టాన్ని ఇందిర 50 ఏళ్ల క్రితమే గుర్తించారు
- వాజ్ పేయి కూడా సౌత్ కు జరిగే అన్యాయాన్ని ముందే గుర్తించారు.
- ప్రధాని మోదీ సౌత్ కు జరిగే అన్యాయాన్ని గుర్తించడం లేదు
- కేంద్రానికి మనం ఒక్క రూపాయి చెల్లిస్తే మనకు 40 పైసలే చెల్లిస్తుంది
- బీహార్ కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే 6 రూపాయలు ఇస్తోంది
- 2002లో వాజ్ పేయి తీర్మానానికి బీజేపీ కట్టుబడి ఉందా లేదా.?
- 24 శాతం ఎంపీలున్న సౌత్ కేంద్రానికి 36 శాతం పన్నులు కడుతుంది
- మనకు జరిగే అన్యాయాన్ని కేంద్రంతో కలిసి పోరాడుదాం
- రాజకీయాలకు అతీతంగా ఈ తీర్మానానికి ఆమోదం తెలపాలి
- రాజకీయ ప్రయోజనాలు వదులుకోవడానికి సిద్దంగా లేం
- మనందరం కలిసి కట్టుగా ఉన్నామనే సంకేతాన్ని కేంద్రానికి పంపాలి
- సీట్లు తగ్గితే సౌత్ మద్దతు లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది
- అన్ని పార్టీలు కలిసి డీలిమిటేషన్ పై కేంద్రంతో ఫైట్ చేద్దాం
- కర్ణాటక,ఏపీ, కేరళ,పుదుఛ్చేరి, తమిళనాడులో అన్ని సంఘాలతో చర్చలు జరిపాం
- అన్ని పార్టీలతో సంప్రదింపుల తర్వాతే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి