రేణుకా ఎల్లమ్మకు సీఎం పట్టువస్త్రాలు

రేణుకా ఎల్లమ్మకు సీఎం పట్టువస్త్రాలు

కొడంగల్, వెలుగు: వికారాబాద్ జిల్లా పోలేపల్లిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్​రెడ్డి ముఖ్య​అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, దామోదర ​రాజనర్సింహ, జుపల్లి కృష్ణారావుతో కలిసి హెలికాప్టర్​లో పోలేపల్లికి చేరుకున్నారు. 

వాళ్లకు ఆలయం వద్ద దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎం రేవంత్​అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి, ప్రత్యేక పూజల అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం నారాయణపేటకు బయలుదేరి వెళ్లారు.