రైతులకు గుడ్ న్యూస్ : పంట వేసినా వేయకపోయినా.. సాగుభూమికి రైతుభరోసా

 రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26 నుంచి అమలు చేయబోతున్న రైతుభరోసా విధివిధానాలపై కలెక్టర్లతో  చర్చించారు సీఎం.ఈ సందర్బంగా .. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు   పంట వేసినా..వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతుభరోసా ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం.  

Also Read :- 4 నెలల్లో దుర్గం చెరువు FTL, బఫర్ జోన్ ఫిక్స్ చేస్తాం

వ్యవసాయానికి పనికి రాని భూములను గుర్తించి వాటికి రైతు భరోసా ఇవ్వొద్దన్నారు..  జాబితాను పక్కాగా తయారు చేసి రైతు భరోసా నుంచి మినహాయించాలని ఆదేశించారు సీఎం రేవంత్.  వ్యవసాయానికి యోగ్యం కానీ భూముల లిస్ట్ ను గ్రామ సభల్లో ప్రచురించాలని ఆదేశించారు.  ఆ భూముల గుర్తించి గ్రామ సభల్లో చర్చించి రైతులకు వెల్లడించాలన్నారు.  ఎలాంటి అనుమానాలు అపోహలకు తావు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని ఆదేశించారు.  ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్లేలా గ్రామ సభలు  నిర్వహించాలన్నారు.   జనవరి 26 తర్వాత జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు సీఎం.