ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడొద్దు

ఆక్రమణల కూల్చివేతల్లో పేదలు రోడ్డున పడొద్దు
  • అర్హులకు డబుల్​ బెడ్రూం ఇండ్లు, లేదా ప్రత్యామ్నాయం : సీఎం రేవంత్​రెడ్డి
  • చెరువులు, నాలాలు, మూసీ ఏరియాలోని పేదల డేటా సేకరించండి
  • ఓఆర్​ఆర్ ​లోపలి ఆక్రమణల వివరాలతో రిపోర్టు రెడీ చేయండి
  • చెరువులు, కుంటల ఎఫ్​టీఎల్ ​జోన్లు గుర్తించాలని అధికారులకు ఆదేశం
  • దసరాలోపు మెట్రో విస్తరణ రూట్​పై పూర్తిస్థాయి డీపీఆర్  
  • ఎయిర్​పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై స్పెషల్​ ఫోకస్​

హైదరాబాద్, వెలుగు : అక్రమ నిర్మాణాల కూల్చివేతల వల్ల పేద కుటుంబాలు రోడ్డున పడొద్దని, అర్హులైన కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించాలని, లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్​లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలన్నారు. వారికి భరోసా కల్పించేందుకు తప్పకుండా ప్రయత్నం చేయాలని సూచించారు. మూసీ రివర్ ఫ్రంట్​ డెవలప్​మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో మంగళవారం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్​రెడ్డి సమీక్షించారు. 

ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన ఆదేశించారు. ఇందులో భాగంగా హైదరాబాద్​ సిటీలో ఉన్న అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్​కు అనుసంధానం చేయాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని అధికారులకు సూచించారు.ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన  గుర్తుచేశారు. 

ఓఆర్​ఆర్​ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్  జోన్లను గుర్తించాలని చెప్పారు. హైదరాబాద్ సిటీలో ఓఆర్ఆర్​ లోపల ఉన్న ప్రతి చెరువు, నాలా ఆక్రమణల వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి పూర్తి రిపోర్టును రెడీ చేయాలన్నారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలుండాలని ఆయన అలర్ట్​ చేశారు. 

ఓల్డ్​ సిటీ మెట్రో విస్తరణ పనుల వేగం 

శంషాబాద్​ ఎయిర్​పోర్టు టు ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొం దించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించా రు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టా లన్నారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకర ణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యే కంగా దృష్టి సారించి, పరిష్కరించాలని ఆయన సూ చించారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్టతో పాటు మెట్రో విస్తరణకు సంబంధించి పలు అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు.

దసరాలోపు మెట్రో విస్తరణ రూట్​పై పూర్తిస్థాయి డీపీఆర్ ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం సూచించారు. మున్సిపల్ శాఖ  ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ రివ్యూ మీటింగ్​లో  పాల్గొన్నారు.

మూసీ నిర్వాసితులకు 16 వేల ఇండ్లు కేటాయింపు

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16 వేల డబుల్​ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ బెడ్ (నదీ గర్భం), బఫర్ జోన్​లో ఉన్న నిర్మాణాలకు పునరావాసం కల్పించేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. 

రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌‌ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు బుధవారం ఇంటింటికీ వెళ్లి అక్కడున్న ప్రజలకు ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించారో చెప్తారు.రివర్ బెడ్​లోని 1,600 ఇండ్లను తొలగించే ముందు అక్కడి వారిని తరలిస్తారు. 

బఫర్ జోన్​లో నివసించే వ్యక్తులు, నిర్మాణాలకు ఆర్​ఎఫ్​సీటీ ఎల్​ఏఆర్​ఆర్​ చట్టం ప్రకారం పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు, వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా ఇస్తారు. డబుల్​ బెడ్రూం ఇండ్లు కూడా కేటాయిస్తారు.