BC Caste Census: 60 రోజుల్లోగా బీసీ కులగణన: సీఎం రేవంత్ ఆదేశాలు

BC Caste Census: 60 రోజుల్లోగా బీసీ కులగణన: సీఎం రేవంత్ ఆదేశాలు

హైదరాబాద్: 60 రోజుల్లోగా బీసీ కులగణన పూర్తి చేయాల‌ని, డిసెంబ‌రు 9లోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ సామాజిక‌, ఆర్థిక కుల స‌ర్వే చేప‌ట్టేందుకు అవ‌స‌ర‌మైన యంత్రాంగం త‌మ వ‌ద్ద లేనందున‌, రాష్ట్ర ప్రభుత్వం ఈ విష‌యంలో ఓ నిర్ణయం తీసుకోవాల‌ని బీసీ క‌మిష‌న్ చైర్మన్ నిరంజ‌న్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. బీసీ క‌మిష‌న్ చైర్మన్ విజ్ఞప్తి మేర‌కు రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని అందుకు కేటాయిస్తున్నామ‌ని  తెలిపారు.

ALSO READ | నేను బీఆర్ఎస్​చైర్మన్‌ను కాదు : శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

బీసీ క‌మిష‌న్‌కు.. రాష్ట్ర ప్రణాళిక విభాగానికి స‌మ‌న్వయ‌క‌ర్తగా ఓ సీనియ‌ర్ ఐఏఎస్ అధికారిని నియ‌మించాల‌ని సీఎం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రక్రియ‌ను త‌క్షణ‌మే ప్రారంభించాల‌ని సూచించారు. ఈ స‌ర్వే పూర్తయితే వెంట‌నే స్థానిక సంస్థలు ఎన్నిక‌లకు వెళ్లొచ్చని సీఎం అన్నారు.