హైదరాబాద్, వెలుగు: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాలమూరు ప్రాజెక్టు పనులు ఎందుకు లేట్ అవుతున్నాయని ఆయన ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ అప్రైజల్స్ నుంచి ప్రాజెక్టును తప్పించడంపై ఆరా తీసినట్టు తెలిసింది. శనివారం ఇరిగేషన్ అధికారులతో సీఎం రివ్యూ చేశారు.
ఈ సందర్భంగా పాలమూరు ప్యాకేజీ 3 పనులు నిలిచిపోవడంపై ఆరా తీశారు. నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే 8 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ పనులు బండరాయి అడ్డుపడడం వల్ల ఆగిపోయాయని, ఎస్టిమేట్స్ రివైజ్ చేయాలని కాంట్రాక్టర్ అడుగుతుండడంతో సమస్య వచ్చిందని అధికారులు సీఎంకు వివరించినట్లు తెలిసింది.