వేగంగా ట్రిపుల్​ఆర్..​ అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం

వేగంగా ట్రిపుల్​ఆర్..​ అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
  • నార్త్​కు భూసేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ.. సౌత్​కు అలైన్​మెంట్ చేయించాలి
  • రైతుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారం విషయంలో ఉదారంగా ఉండాలి
  • అధికారులకు సీఎం రేవంత్​రెడ్డి ఆదేశం
  • మూడేండ్లలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్​లో 
  • 29,700 కిలోమీటర్ల మేర రోడ్లు
  • సింగిల్​, డబుల్​ రోడ్లను విస్తరించాలి
  • పంట పొలాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సులువుగా చేరేలా
  • నేషనల్​ హైవేలపై అండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  • ఆర్ అండ్ బీ, అట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ శాఖలు స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్వయం చేసుకోవాలని సూచన
  • ట్రిపుల్​ ఆర్​, నేషనల్​ హైవేలపై అధికారులతో సమీక్ష
  • గ్రామీణ రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ. వెయ్యి కోట్లు విడుదల

హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ ఆర్​) నార్త్​కు సంబంధించి భూ సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను త్వర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పూర్తి చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అధికారులను సీఎం రేవంత్​ రెడ్డి ఆదేశించారు. రైతుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారం నిర్ణయించే విష‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో ఉదారంగా వ్యవ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. ఆర్బిట్రేట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లుగా ఉన్న జిల్లా క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లెక్టర్లు  వీలైనంత ఎక్కువ మొత్తంలో రైతుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారం అందేలా చూడాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌న్నారు. ట్రిపుల్​ఆర్​, నేషనల్​ హైవేల భూ సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిహారం, హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానంలో ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారుల నిర్మాణం, రేడియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ రోడ్ల పై సెక్రటేరియెట్​లో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీక్ష నిర్వహించారు. భూ సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంలో స్థానిక ప్రజా ప్రతినిధులతోనూ చ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్చించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని, త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చూ రైతుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మావేశం కావాలని సూచించారు. 

ఆయా ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారుల నిర్మాణాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిగే ప్రయోజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వారికి వివరిస్తూ.. భూ సేక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ణ స్పీడప్​ చేయాలని అన్నారు. ట్రిపుల్ ఆర్​ ​సౌత్​కు  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ఏఐ సూత్రప్రాయ ఆమోదం తెలిపినందున‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెచ్ఎండీఏతో అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చేయించాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సూచించారు. హైద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిపే 11 ర‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దారుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆటంకం లేకుండా రేడియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ రోడ్ల నిర్మాణం చేప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్టాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని సీఎం  ఆదేశించారు. రేడియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్ రోడ్లకు సంబంధించి ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలంగా ఉండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డంతో పాటు ఔట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ రింగు రోడ్డు, ట్రిపుల్​ ఆర్ ​అనుసంధానంలో ఇబ్బందులు లేకుండా చూడాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రేవంత్​ సూచించారు. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో ఆర్ అండ్ బీ ప‌‌‌‌రిధిలో 12 వేల కిలోమీట‌‌‌‌ర్లు, పంచాయ‌‌‌‌తీరాజ్ శాఖ ప‌‌‌‌రిధిలో 17,700 కిలోమీట‌‌‌‌ర్ల మేర ర‌‌‌‌హ‌‌‌‌దారులు నిర్మించాల‌‌‌‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీటి నిర్మాణానికి సంబంధించి పాత జిల్లాల‌‌‌‌ను యూనిట్‌‌‌‌గా తీసుకోవాల‌‌‌‌ని సూచించారు.

 ఆర్ అండ్ బీ, పంచాయ‌‌‌‌తీరాజ్ శాఖ అనే తేడా లేకుండా ఒకే ర‌‌‌‌క‌‌‌‌మైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేప‌‌‌‌ట్టాల‌‌‌‌న్నారు. ఇందుకు సంబంధించి  క‌‌‌‌న్సల్టెన్సీల నియామ‌‌‌‌కం, డీపీఆర్ ల త‌‌‌‌యారీ, ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణం విష‌‌‌‌యంలో క్రియాశీల‌‌‌‌కంగా వ్యవ‌‌‌‌హ‌‌‌‌రించాల‌‌‌‌ని అధికారుల‌‌‌‌ను సీఎం ఆదేశించారు. మూడేండ్లలో ఈ ర‌‌‌‌హదారుల నిర్మాణం పూర్తికావాల‌‌‌‌ని సూచించారు. వ‌‌‌‌ర‌‌‌‌ద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్ల  మరమ్మతులు చేప‌‌‌‌ట్టాల‌‌‌‌ని, కూలిన వంతెనలను వెంట‌‌‌‌నే నిర్మించాల‌‌‌‌ని ఆదేశించారు. ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణం,  రిపేర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు వెంట‌‌‌‌నే విడుద‌‌‌‌ల చేసి, కేంద్రం నుంచి రావాల్సిన మ్యాచింగ్ గ్రాంట్‌‌‌‌ను పొందాల‌‌‌‌ని ఆర్థిక శాఖ అధికారుల‌‌‌‌కు సీఎం సూచించారు. 

నాగ్​పూర్​-విజయవాడ, ఎల్​డబ్ల్యూఎఫ్​ ఏరియాలో రోడ్లు పూర్తి చేయాలి

రాష్ట్రంలోని మంచిర్యాల‌‌‌‌, పెద్దప‌‌‌‌ల్లి, జ‌‌‌‌య‌‌‌‌శంక‌‌‌‌ర్ భూపాల‌‌‌‌ప‌‌‌‌ల్లి, వ‌‌‌‌రంగ‌‌‌‌ల్‌‌‌‌, హ‌‌‌‌న్మకొండ‌‌‌‌, మ‌‌‌‌హ‌‌‌‌బూబాబాద్‌‌‌‌, ఖ‌‌‌‌మ్మం మీదుగా సాగే నాగ్‌‌‌‌పూర్–-విజ‌‌‌‌య‌‌‌‌వాడ (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌-–163జీ) ర‌‌‌‌హ‌‌‌‌దారి, ఆర్మూర్‌‌‌‌- –జ‌‌‌‌గిత్యాల‌‌‌‌– -మంచిర్యాల ర‌‌‌‌హ‌‌‌‌దారి (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌-–63), జ‌‌‌‌గిత్యాల‌‌‌‌–-క‌‌‌‌రీంన‌‌‌‌గ‌‌‌‌ర్ (ఎన్‌‌‌‌హెచ్ –563) ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణంతో పాటు వామ‌‌‌‌ప‌‌‌‌క్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల (ఎల్‌‌‌‌డ‌‌‌‌బ్ల్యూఎఫ్‌‌‌‌) రోడ్ల నిర్మాణానికి సంబంధించి భూ సేక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌, అట‌‌‌‌వీ అనుమ‌‌‌‌తుల్లో అడ్డంకుల తొల‌‌‌‌గింపున‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి ప‌‌‌‌లు సూచ‌‌‌‌న‌‌‌‌లు చేశారు. ప్రజ‌‌‌‌ల‌‌‌‌కు ఉప‌‌‌‌యోగ‌‌‌‌ప‌‌‌‌డే ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణంలో అట‌‌‌‌వీ శాఖ ఎందుకు కొర్రీలు పెడుతున్నదని ప్రిన్సిప‌‌‌‌ల్ చీఫ్ క‌‌‌‌న్జర్వేట‌‌‌‌ర్ ఆఫ్ ఫారెస్ట్​ (పీసీసీఎఫ్‌‌‌‌) డోబ్రియ‌‌‌‌ల్‌‌‌‌ను సీఎం ప్రశ్నించారు. గ‌‌‌‌తంలో కొన్ని నిబంధ‌‌‌‌న‌‌‌‌లు పాటించ‌‌‌‌క‌‌‌‌పోవ‌‌‌‌డంతో స‌‌‌‌మ‌‌‌‌స్యలు ఉన్నాయ‌‌‌‌ని పీసీసీఎఫ్ బ‌‌‌‌దులిచ్చారు. 

Also Read :- పాలమూరు–రంగారెడ్డి పనులు స్పీడప్ చేయాలి

రాష్ట్రస్థాయిలో ప‌‌‌‌రిష్కార‌‌‌‌మ‌‌‌‌య్యే స‌‌‌‌మ‌‌‌‌స్యల‌‌‌‌ను ఇక్కడే ప‌‌‌‌రిష్కరిస్తామ‌‌‌‌ని, కేంద్ర అట‌‌‌‌వీ, ప‌‌‌‌ర్యావ‌‌‌‌ర‌‌‌‌ణ శాఖ‌‌‌‌కు సంబంధించి ఏవైనా స‌‌‌‌మ‌‌‌‌స్యలుంటే వెంట‌‌‌‌నే నివేదిక రూపంలో స‌‌‌‌మ‌‌‌‌ర్పించాల‌‌‌‌ని సీఎం  ఆదేశించారు. ఆర్ అండ్ బీ, అట‌‌‌‌వీ శాఖ నుంచి ఒక్కో అధికారిని ప్రత్యేకంగా ఈ స‌‌‌‌మ‌‌‌‌స్యల ప‌‌‌‌రిష్కారానికి కేటాయించాల‌‌‌‌ని  సూచించారు. సీఎస్​ వారితో ప‌‌‌‌ది రోజుల‌‌‌‌కోసారి స‌‌‌‌మీక్షించి త్వర‌‌‌‌గా క్లియ‌‌‌‌రెన్స్ వ‌‌‌‌చ్చేలా చూడాల‌‌‌‌ని, ఇక్కడ కాక‌‌‌‌పోతే ఆర్ అండ్ బీ, అట‌‌‌‌వీ శాఖ మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి, అధికారుల‌‌‌‌తో స‌‌‌‌మావేశ‌‌‌‌మై.. అనుమ‌‌‌‌తులు సాధించాల‌‌‌‌న్నారు.   జాతీయ ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణంలో అండ‌‌‌‌ర్ పాస్‌‌‌‌ల నిర్మాణాన్ని విస్మరిస్తుండ‌‌‌‌డంతో రైతులు ఇబ్బందుల‌‌‌‌కు గుర‌‌‌‌వుతున్నార‌‌‌‌ని డిప్యూటీ సీఎం మ‌‌‌‌ల్లు భ‌‌‌‌ట్టి విక్రమార్క అన్నారు. ఆ స‌‌‌‌మ‌‌‌‌స్య ఎదురుకాకుండా నిర్మాణ స‌‌‌‌మ‌‌‌‌యంలో త‌‌‌‌గిన  జాగ్రత్తలు తీసుకోవాల‌‌‌‌ని ఆదేశించారు. రైతులు కిలోమీట‌‌‌‌ర్ల కొద్దీ దూరం వెళ్లి తిరిగి వ‌‌‌‌చ్చే ప‌‌‌‌రిస్థితి లేకుండా చూడాల‌‌‌‌ని సూచించారు.

ప్రతి పంచాయతీకి బీటీ రోడ్డు 

రాష్ట్రంలో గ్రామీణ ర‌‌‌‌హ‌‌‌‌దారుల‌‌‌‌కు మ‌‌‌‌హ‌‌‌‌ర్దశ రానున్నది.  రూరల్​ రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్​ రూ.వెయ్యి  కోట్లు కేటాయించారు. ఈ ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణానికి ఈ నెల నుంచి నెల‌‌‌‌కు రూ.150 కోట్ల చొప్పున జూన్ నెలాఖ‌‌‌‌రు నాటికి రూ.వెయ్యి కోట్లు విడుద‌‌‌‌ల చేయాల‌‌‌‌ని ఆర్థిక శాఖ అధికారుల‌‌‌‌ను సీఎం ఆదేశించారు. అట‌‌‌‌వీ ప్రాంతాల్లోని గ్రామాల‌‌‌‌కు సైతం ర‌‌‌‌హ‌‌‌‌దారులు నిర్మించాల‌‌‌‌ని సూచించారు. ఆర్ అండ్ బీ, పంచాయ‌‌‌‌తీరాజ్ శాఖ‌‌‌‌ల‌‌‌‌పై  సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు.  ఈ సంద‌‌‌‌ర్భంగా గ్రామీణ ర‌‌‌‌హ‌‌‌‌దారుల‌‌‌‌కు సంబంధించి సీఎం ప‌‌‌‌లు కీల‌‌‌‌క వ్యాఖ్యలు చేశారు. గ‌‌‌‌త కాలంలోని ఎడ్ల బండ్లు, సైకిళ్లు, మోటార్ సైకిళ్ల రాక‌‌‌‌పోక‌‌‌‌ల‌‌‌‌కు అనుగుణంగా సింగిల్ లైన్‌‌‌‌, డబుల్ లైన్ రోడ్ల వెడ‌‌‌‌ల్పును నిర్ణయించారని అన్నారు. ప్రస్తుతం మారుమూల ప‌‌‌‌ల్లెల్లోనూ కార్లు, ట్రాక్టర్లు, ఇత‌‌‌‌ర భారీ వాహ‌‌‌‌నాలు తిరుగుతున్నందున.. వాటి రాక‌‌‌‌పోక‌‌‌‌ల‌‌‌‌కు వీలుగా ఆయా ర‌‌‌‌హ‌‌‌‌దారుల కొల‌‌‌‌త‌‌‌‌ల‌‌‌‌ను మార్చాల్సి ఉంటుంద‌‌‌‌న్నారు.  వాహ‌‌‌‌నాలు ఆటంకాలు లేకుండా సాగిపోయేందుకు వీలుగా ర‌‌‌‌హ‌‌‌‌దారుల‌‌‌‌ను నిర్మించాల‌‌‌‌ని చెప్పారు. గత సర్కారు హయాంలో తండాలు, గూడేలను పంచాయ‌‌‌‌తీలు చేసినా వాటికి ర‌‌‌‌హ‌‌‌‌దారులు, పంచాయ‌‌‌‌తీ, పాఠశాల భ‌‌‌‌వ‌‌‌‌నాల నిర్మాణాల‌‌‌‌ను విస్మరించార‌‌‌‌ని సీఎం రేవంత్​ అన్నారు. రాష్ట్రంలో ప్రతి పంచాయ‌‌‌‌తీకి బీటీ రోడ్డు ఉండాల‌‌‌‌ని ఆదేశించారు.

గ్రామాల నుంచి మండ‌‌‌‌లాల‌‌‌‌కు సింగిల్ రోడ్లు, మండ‌‌‌‌లాల నుంచి జిల్లా కేంద్రాల‌‌‌‌కు డ‌‌‌‌బుల్ రోడ్లు క‌‌‌‌చ్చితంగా ఉండాల‌‌‌‌ని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుంత‌‌‌‌లు ప‌‌‌‌డిన ర‌‌‌‌హ‌‌‌‌దారుల‌‌‌‌కు వెంట‌‌‌‌నే మ‌‌‌‌ర‌‌‌‌మ్మతులు ప్రారంభించాల‌‌‌‌ని ఆదేశించారు.  పంచాయ‌‌‌‌తీరాజ్‌‌‌‌, ఆర్ అండ్ బీ ర‌‌‌‌హ‌‌‌‌దారుల నిర్మాణ ప్రమాణాల్లో తేడాలు ఉన్నాయ‌‌‌‌ని, ఇక ముందు అలా ఉండ‌‌‌‌డానికి వీల్లేద‌‌‌‌ని సీఎం అన్నారు. రెండు శాఖల పరిధిలోని రోడ్లను ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని  సూచించారు.  వాహ‌‌‌‌నదారులు తాము ప్రయాణించేది పీఆర్ రోడ్డా? ఆర్ అండ్ బీ రోడ్డా? అనే విష‌‌‌‌యాన్ని ప‌‌‌‌ట్టించుకోర‌‌‌‌ని, కేవ‌‌‌‌లం ప్రయాణం ఎలా సాగుతుంద‌‌‌‌నేది ప్రధాన‌‌‌‌మ‌‌‌‌న్నారు. ఈ సమావేశంలో  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమ‌‌‌‌టిరెడ్డి వెంక‌‌‌‌ట్ రెడ్డి, సీత‌‌‌‌క్క, కొండా సురేఖ‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.