నల్గొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ‘మూసీ పునరుజ్జీవ పాదయాత్ర’ సంగెం నుంచి ప్రారంభమైంది. మూసీ నీటిని బాటిల్లో తీసుకుని సీఎం పరిశీలించారు. భీమలింగం వరకు 2.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగనుంది. నాగిరెడ్డిపల్లిలో యాత్రను ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. సీఎం పాదయాత్రకు మూసీ బాధిత రైతులు భారీగా తరలివచ్చారు.
మూసీ కాలుష్యంపై రైతులు, మత్స్యకారులతో సీఎం మాట్లాడారు. కాలుష్యం కారణంగా వాళ్లకు కలుగుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు గురించి వాళ్లకు వివరించారు. నాగిరెడ్డిపల్లి బహిరంగ సభలో మూసీ కాలుష్యం, ప్రభుత్వం చేపడుతున్న మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు, దాని వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తారు.