స్త్రీల ఆరోగ్యం కోసం మరిన్ని హాస్పిటల్స్..పింక్ పవర్ రన్లో సీఎం రేవంత్

 స్త్రీల ఆరోగ్యం కోసం మరిన్ని హాస్పిటల్స్..పింక్ పవర్ రన్లో సీఎం రేవంత్

ఉమెన్ హెల్త్ కేర్ ను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీఎం  రేవంత్ రెడ్డి. స్త్రీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం గచ్చిబౌలిలో   నిర్వహించిన  పింక్ పవర్  రన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్బంగా పింక్ పవర్  రన్ లో విజేతలుగా నిలిచిన వారికి  రేవంత్ రెడ్డి అవార్డులు అందజేశారు.  పింక్ పవర్ రన్  నిర్వహించిన సుధా ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.

రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కోసం  తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సుధారెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో  సెప్టెంబర్ 29న ఉదయం పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనర్సింహా రెడ్డి జెండా ఊపీ పింక్ పవర్ రన్ ను ప్రారంభించారు. ఒకే సారి 3, 5, 10కె రన్ ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సుమారు 5వేల మందికి పైగా  పింక్ పవర్ రన్‌లో పాల్గొన్నారు.  స్టూడెంట్స్, డాక్టర్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో సహా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు.