పదేళ్లు ఉద్యోగాల కోసం యువత కొట్లాడింది. కానీ.. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. జేఎన్టీయూ ఆద్వర్యంలో నిర్వహించిన క్వాలిటీ విద్యపై సదస్సులో ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు.
పుస్తకాల్లో చదువులకు, బయట మార్కెట్ లో సమాజానికి ఏమాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్ సిలబస్ లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పట్టాలు తీసుకుంటున్నారే తప్పా.. వారిలో పనితనం ఉండట్లేదని ఆయన అన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీ పడే విదంగా టెక్నికల్ కోర్సులు సిలబస్ మారాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రభుత్వానికి భేషజాలు లేవు, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. నోటిఫికేషన్ల ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుందని అన్నారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానమని వివరించారు.
ALSO READ | సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరిస్తం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లు మాత్రమేనని. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను ప్రస్తుతం కాలేజీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజెంట్ సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీగా ఉందని. ఆ తర్వాతే అభివృద్ధిని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్ - 2024 లోగోను విడుదల చేశారు.
JNTU ఏటా లక్షమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పాస్ ఔవుట్ అవుతున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫాక్టరీలుగా ఉండకూడదని సూచించారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. ఈ అకాడమిక్ ఈయర్ నుంచి బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్ చెల్లిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమని రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో నాడు IDPL ను ఇందిరా గాంధీ పెట్టడం వల్లే నేడు ఫార్మారంగం అభివృద్ధి చెందిందన్నారు. పరీక్షలు వాయిదా వేస్తే విద్యార్థులకే తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు.
ALSO READ | ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు ఐఎస్ఓ సర్టిఫికెట్లు
2030 నాటికల్లో ఐటీ రంగంలో కర్ణాటకని అదిగమిస్తామని ఐటీ శాఖ మంత్రి తెలిపారు. 200 ఎకరాల్లో ఏఐ సిటీని నిర్మిస్తున్నామని ఆయన అన్నారు. మంచి సలహాలు ఇస్తే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు విద్యావేత్తలను కోరారు. రాబోయే రోజుల్లో సాఫ్ట్ వేర్ రంగంలో మనమే ముందుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.