దసరా పండగ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చేరుకున్నారు. స్వగ్రామంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా గ్రామస్థులు ముఖ్యమంత్రికి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు.
ALSO READ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రత్యేక పూజలు
రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో స్వగ్రామంలో పర్యటించడం ఇదే తొలిసారి. కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.72 లక్షల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
స్వగ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన వివరాలు..
- కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ. 72 లక్షల వ్యయంతో నిర్మించిన మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
- గ్రామపంచాయతీ భవనం ముందు మామిడి మొక్కను నాటిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
- రూ. 18 కోట్లతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.
- సీఎం సొంత ఇలాకాలో రూ. 18 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన.
- ఫైలెట్ ప్రాజెక్ట్ కింద కొండారెడ్డిపల్లి గ్రామంలో కొండ్రెడ్డి పార్వతమ్మ ఇంటిపై ఏర్పాటుచేసిన 3kw కెపాసిటీ సౌర విద్యుత్తును ప్రారంభించిన ముఖ్యమంత్రి.
- ముఖ్యమంత్రి స్వగ్రామంలో రూ. 32 లక్షల వ్యయంతో నిర్మించనున్న చిల్డ్రన్స్ పార్క్, బహిరంగ వ్యాయామశాల నిర్మాణానికి శంకుస్థాపన.
- కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ. 64 లక్షలతో చేపట్టనున్న బస్ షెల్టర్, విద్యుత్ దీపాలంకరణ పనులకు శంకుస్థాపన.