నేరగాళ్లకు నో ప్రొటోకాల్.. సక్కగ బొక్కలో వెయ్యండి:​సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేటోళ్లు ఎవరైనా సరే క్షమించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా, ఎంతటి వారైనా సరే ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్తించదని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చి హడావుడి చేస్తే సక్కగ బొక్కలో వేయాలని పోలీసులను ఆదేశించారు. ‘‘ముఖ్యమంత్రిగా, హోం మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మిమ్మల్ని ఆదేశిస్తున్నా.. పేదలు, సామాన్యులు, బాధితుల పట్ల సానుభూతితో ఉండండి. నేరగాళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి.

పీఎస్​కు వచ్చిన వాళ్ల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో.. పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ప్రజాప్రతినిధి కూడా పోలీసులతో మర్యాదగా వ్యవహరించాల్సిందే. నేరగాళ్లు ఎంతటి వారైన సరే ప్రొటోకాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్తించదు” అని తెలిపారు. నేరగాళ్లకు కూడా మీరు ప్రొటోకాల్ పాటిస్తే ఉద్యోగాలు చేయలేరని పోలీసులతో అన్నారు.‘‘కబ్జాదారులతో, హత్యలు చేసిన వాళ్లతో,  ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదు.. అలాంటి వాళ్లు పోలీస్ పేరు వింటేనే భయపడాలి” అని సీఎం పేర్కొన్నారు.

ప్రజాపాలన -విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్‌‌ రోడ్ లోని హెచ్‌‌ఎండీఏ గ్రౌండ్స్‌‌లో హోంశాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, డీజీపీ జితేందర్ సహా పోలీస్‌‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేట్‌‌ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌‌(ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌)ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ లోగోను ఆవిష్కరించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్​కు సంబంధించిన కొత్త వాహనాలు, బోట్లను జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ విభాగాలకు చెందిన స్టాల్స్‌‌ను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌‌ రెడ్డి మాట్లాడారు. 

డ్రగ్స్, సైబర్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు.. 

డ్రగ్స్ కట్టడికి కృషి చేయాలని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘గత ప్రభుత్వంలో డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి అధికారి వరకు రాజకీయ ఒత్తిడి, రాజకీయ ఆదేశాల మేరకు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించారు. కానీ మా ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా, రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ వారి సమర్థతను బట్టి హోదా ఇచ్చాం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా నియమాకాలు జరిపాం. ఈ మధ్య నేరాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు ఆర్థిక నేరాలు, హత్యలు, అత్యాచారాలను తీవ్రమైన నేరాలుగా పరిగిణించేవాళ్లం.కానీ ఇప్పుడు సైబర్ క్రైమ్, డ్రగ్స్‌‌ భారీగా పెరిగిపోతున్నాయి.

 రానున్న రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది అత్యంత తీవ్రమైన నేరంగా మారనుంది. వీటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. బీటెక్, ఎంటెక్‌‌ చదివిన వారిని పిక్‌‌ చేసి వారిని డేటా అనాలసిస్‌‌ చేసే విధంగా అవసరమైన శిక్షణ ఇవ్వాలి. మాదకద్రవ్యాలను నివారించేందుకు స్కూల్స్, కాలేజీల్లో అవగాహన గల టీచర్స్‌‌ను నియమించాలి. విద్యాసంస్థల యాజమాన్యాలకు కూడా మాదకద్రవ్యాల నివారణపై బాధ్యత ఉండాలి. డ్రగ్స్ కేసుల్లో శిక్షల శాతం తక్కువగా ఉంటున్నది. డ్రగ్స్, సైబర్‌‌‌‌ కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తాం. ఆరు నెలల లోపే కోర్టులు తీర్పు వెల్లడించేలా ప్రణాళికలు రూపొందిస్తాం” అని తెలిపారు.

క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదు.. 

 

ఎవరైనా స్టేషన్ కు వచ్చి హడావిడి చేస్తే ఊరుకోవద్దని పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ‘‘ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు.. ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా స్వేచ్ఛ ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసులే. 

అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనే వారు కూడా పోలీసులే. కొద్దిమంది పోలీసుల వ్యవహారం మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్‌‌తో కాదు.. పోలీస్ పేరు వినిపిస్తేనే క్రిమినల్స్ భయపడేలా చేయండి. కొంతమంది డాబూదర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్‌‌కు వచ్చి హడావిడి చేస్తున్నారు. అలాంటి వారిని సక్కగ బొక్కల వెయ్యండి” అని ఆదేశించారు.

 

హోంగార్డుల దినభత్యం వెయ్యికి పెంపు.. 

హోంగార్డులు, ట్రాన్స్‌‌జెండర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘పోలీసులతో సమానంగా పనిచేస్తున్న హోంగార్డులకు భరోసా ఇస్తున్నాను. రాష్ట్రంలో దాదాపు 14 వేల మందికి పైగా హోంగార్డులు పని చేస్తున్నారు. డిసెంబర్‌‌‌‌ 6న హోంగార్డ్స్‌‌ రైజింగ్‌‌ డే సందర్భంగా మీ సంక్షేమం కోసం పలు నిర్ణయాలు తీసుకున్నాం. రూ.921గా  ఉన్న దిన భత్యాన్ని రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్‌‌ను రూ.100 నుంచి రూ 200 లకు పెంచుతున్నాం. ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌‌గ్రేషియా అందిస్తాం. 

వీటితో పాటు హోంగార్డుల ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాం. ప్రతి హోంగార్డుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌‌ కార్డులను అందిస్తాం. ఈ విధానం జనవరి నుంచే వర్తించే విధంగా చర్యలు తీసుకున్నాం. ట్రాన్స్‌‌జెండర్స్‌‌ సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ట్రాఫిక్ సిగ్నల్స్‌‌ వద్ద చాలా మంది ట్రాన్స్‌‌జెండర్స్‌‌ను చూశాను. 

వారికి సిగ్నల్స్‌‌పై పూర్తి అవగాహన ఉంది. ట్రాన్స్‌‌జెండర్స్‌‌ను ట్రాఫిక్ అసిస్టెంట్స్‌‌గా నియమిస్తున్నాం. సమాజం వారికి కూడా గౌరవం ఇచ్చే విధంగా చూస్తాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. దరఖాస్తులు చేసుకోవాలి. ట్రాన్స్‌‌జెండర్స్‌‌ను ఈ ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుంది. ఎలాంటి భయాందోళనకు గురికావొద్దు” అని భరోసా ఇచ్చారు. కాగా, వేడుకల్లో పోలీస్‌‌ బ్యాండ్‌‌, సీఎం సెక్యూరిటీలో కీలక బాధ్యతలు నిర్వహించే డాగ్‌‌ స్క్వాడ్ మాయా, రాఖీ, శ్యామ్‌‌ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆక్టోపస్‌‌ చేసిన మాక్‌‌ డ్రిల్‌‌ రాష్ట్ర పోలీసుల నైపుణ్యానికి అద్ధం పట్టింది. 

డ్రగ్ ఫ్రీ స్టేట్​గామారుస్తం: డిప్యూటీ సీఎం భట్టి 

పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌లో అత్యాధునిక వ్యవస్థ ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘రాష్ట్రంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందులో భాగంగానే ఎస్‌‌డీఆర్‌‌‌‌ఎఫ్‌‌ను ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హైదరాబాద్ సహా రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. తల్లిదండ్రుల ఆవేదనను అర్థం చేసుకుని మాదకద్రవ్యాల నివారణ దిశగా ముందుకు వెళ్తున్నాం. సైబర్ నేరాలను కూడా ఆధునిక టెక్నాలజీతో అధిగమిస్తున్నాం. 

పోలీస్ వ్యవస్థ అనేది ఒక నమ్మకం. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధితులకు అండగా ఉన్నామనే భరోసా పోలీస్ శాఖ ఇస్తుంది. పోలీస్ డిపార్ట్‌‌ను బలోపేతం చేసేందుకు భారీగా బడ్జెట్‌‌ కేటాయించాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ కొందరి కోసమో పోలీస్ శాఖ పని చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరి కోసం పోలీస్ శాఖ పని చేస్తున్నది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే సమర్ధంగా ఎదుర్కొన్నాం. సమాజంలో అవమానాలకు గురవుతున్న ట్రాన్స్‌‌జెండర్స్‌‌ను ట్రాఫిక్ అసిస్టెంట్స్‌‌గా నియమిస్తున్నాం” అని తెలిపారు.

నేరాలను నియంత్రిస్తున్నం: డీజీపీ జితేందర్ 

రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణపై సీఎం రేవంత్‌‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రంలో క్రైమ్‌‌, డ్రగ్స్‌‌, గంజాయి, సైబర్‌‌‌‌ నేరాలను నియంత్రిస్తున్నామని చెప్పారు. ‘‘ఈ ఏడాది 42 ఎన్‌‌డీపీఎస్‌‌ యాక్ట్‌‌ కేసుల్లో100 మందికి పైగా జైలు శిక్షలు పడ్డాయి. భవిష్యత్తులో శిక్షల శాతం పెంచుతాం. సైబర్ నేరాల్లో డబ్బు కోల్పోయిన దాదాపు10 వేల మంది బాధితులకు రూ.135 కోట్ల మేరకు తిరిగి అందించాం. సైబర్ నేరాల నియంత్రణలో రాష్ట్ర పోలీసులకు దేశంలో మంచి గుర్తింపు వచ్చింది. 

భువనేశ్వర్‌‌‌‌లో జరిగిన డీజీపీల సమావేశంలో రాష్ట్ర పోలీసింగ్ గురించి వివరించాం. డయల్‌‌ 112కి కాల్ వస్తే 10 నిమిషాల లోపే ఘటనా స్థలానికి చేరుతున్నాం. భద్రతపై బాధితుల్లో భరోసా కల్పిస్తున్నాం. ఎమర్జెన్సీ సర్వీస్‌‌లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. ఎలాంటి తీవ్రమైన కేసునైనా సరే 24 గంటల్లోనే ఛేదిస్తున్నాం. పాస్‌‌పోర్ట్‌‌ వెరిఫికేషన్‌‌లో జాతీయి స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నాం. పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌కు ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయి” అని చెప్పారు.