డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి..

డీఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి..

మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. 2024, జూన్ 30వ తేదీ ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని డీఎస్ నివాసానికి వెళ్లి ఆయన పార్థీవదేహానికి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్ కు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్.. డీఎస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడన్నారు. కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరవలేరన్నారు. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగారని.. తెలంగాణ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.

కాగా,  నిజామాబాద్ లోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు మరికాసేపట్లో నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీ శ్రీనివాస్..  జూన్ 29వ తేదీ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు.