అంబేద్కర్‌కు సీఎం రేవంత్ రెడ్డి నివాళి

రాజ్యాంగా నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం అంబేద్కర్ 133వ నివాళులర్పించి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతోపాటు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్, పలువురు అంబేద్కర్ కు నివాళి అర్పించారు.

ఖమ్మం  జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు.