
హైదరాబాద్ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి సీఎం బూర్గుల రామకృష్ణారావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గురువారం ఆయన జయంతి సందర్భంగా ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సీఎంగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా, సాహితీవేత్తగా, బహు భాషా వేత్తగా బూర్గుల బహుముఖ ప్రజ్ఞ కనబరిచారని కొనియాడారు. ఈ ప్రోగ్రాంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.