మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్థంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఇందిరాగాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు రేవంత్ . నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నివాళి అర్పించారు.
ఉక్కుమహిళగా .. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందిరా గాంధీ వర్దంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .... అనేక సంస్కరణలను తీసుకొచ్చిన గొప్ప రాజకీయ నాయకురాలు ఇందరాగాంధీ.. ఎంతోమంది రాజకీయనాయకులకు.. ప్రస్తుత యువత మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ఆమె పర్యటించారని.. ప్రతి గ్రామంలో ఆమె తిరిగారన్నారు. ఇందిరాగాంధీ ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.