- కాళోజీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు : ‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి.. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి.. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు’ అని చెప్పిన ప్రజా కవి కాళోజీ నారాయణరావు నిత్య స్మరణీయుడని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.
బుధవారం కాళోజీ వర్ధంతిని పురస్కరించుకొని ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.