ఓల్డ్ సిటీ కాదు..ఒరిజినల్ హైదరాబాద్: మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్

ఓల్డ్ సిటీ కాదు..ఒరిజినల్ హైదరాబాద్: మెట్రో శంకుస్థాపనలో సీఎం రేవంత్
  • ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు..తర్వాత అభివృద్ధిపై దృష్టి 

హైదరాబాద్ పాత బస్తీ మెట్రోలైన్కు శుక్రవారం (మార్చి8) ఫరూక్ నగర్ డిపో దగ్గర సీఎం రేవంత్రెడ్డి భూమి పూజ చేశారు. ఎంజీ బీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా 4 స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు.రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

 ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ హైదరాబాద్..దీనిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ఎంతో మంది కష్టపడ్డారు.. ఆ గుర్తింపును కాపాడే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు.. తర్వాత అభివృద్దిపైనే దృష్టి పెడతామన్నారు. మూడేండ్లలో ప్రాజెక్టు పూర్తయ్యేలా సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కు తాగునీరు తెచ్చిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు . 

గత ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ నుంచి శంషాబాద్ కు ఎయిర్ పోర్టు కు మెట్రో తీసుకెళ్లానని నిర్ణయించింది. ఓల్డ్ సిటీ నుంచి ఇతర దేశాలకు వెళ్లేవారిని పంపించేందుకు ఎయిర్ పోర్టుకు వెళ్తుంటారు.. అందుకోసమే ఈ మార్గంలో మెట్రో నిర్మాణం చేపడుతున్నామన్నారు రేవంత్ రెడ్డి. అవసరమైన ప్రాంతాలకు మిడిల్ క్లాస్,పేదలకు ఉపయోగపడే విధంగా మెట్రో మార్గాలను సిద్ధం చేస్తున్నామన్నారు.. అందుకోసం ఫేజ్ 2 ను వివిధ మార్గాలకు విస్తరిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  

ఎంజీబీఎస్, దారుల్ షిఫా జంక్షన్, పురాణా హవేలీ, ఇత్తేబాద్ చౌక్, అలీ జాకోట్ల, మీర్ మోమిన్ దర్గా, హరిబౌలీ, శాలిబండ, షంషీర్ గంజ్, అలియా బాద్ ప్రాంతాల మీదుగా ఫలక్ నుమా వరకు ఈ మెట్రో లైన్ నిర్మాణం జరగనుంది. 

ALSO READ :- ఎలక్టోరల్ బాండ్స్ డిటేల్స్ ఇచ్చేందుకు టైం కోరిన SBI మార్చి 11న సుప్రీం కోర్టు విచారణ

సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా ఏరియాల్లో స్టేషన్లను నిర్మించనున్నారు. మతపరమైన చారిత్రక కట్టడాలకు డ్యామేజీ లేకుండా రోడ్డు విస్తరణను 100 ఫీట్లకే పరిమితం చేశారు. స్టేషన్ల వద్ద రోడ్డును 120 ఫీట్లకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే చార్మినార్,సాలర్ జంగ్ మ్యూజికం వంటి చారిత్రక కట్టడాలను చూసేందుకు పర్యాటకులకు సౌకర్యంగా ఉటుంది.