ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్.. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని... విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి సహృదయంతో సహకరించాలని కోరారు.
మహబూబాబాద్ ఎంపీ ఫలితాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. జూన్ 9న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఎంపీ బలరాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.