బతుకమ్మ మీద సీఎం చిత్రం

బతుకమ్మ మీద సీఎం చిత్రం

ఎల్లారెడ్డిపేట, వెలుగు : ఓ సీనియర్  కాంగ్రెస్  నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. బతుకమ్మ మీద రంగులు అద్ది సీఎం ఫొటోను చిత్రీకరించాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన గోగూరి శ్రీనివాస్ రెడ్డి దంపతులు గత ఏడాది బతుకమ్మను పేర్చి చేతి గుర్తు వచ్చేలా తీర్చిదిద్దారు. గురువారం సద్దుల బతుకమ్మ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ముఖచిత్రం కనిపించేలా బతుకమ్మ మీద రంగులు అద్దారు.