- పక్కా ప్లాన్ తో ఆయా విభాగాల ప్రక్షాళన
- అధికారుల ఎంపికలో సీఎం రేవంత్ఆచితూచి ముందుకు..
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్హైదరాబాద్ను ఐకాన్సిటీగా డెవలప్చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా కీలక విభాగాలను ప్రక్షాళిస్తున్నారు. ఆఫీసర్ల ఎంపికలో ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. తాజాగా మంగళవారం మరోసారి హైదరాబాద్కేంద్రంగా ఆఫీసర్ల బదిలీలు చేపట్టారు. అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ఆయా అధికారులకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఏర్పాటు చేసిన హైడ్రాకు సీనియర్ఐపీఎస్ఆఫీసర్రంగనాథ్ ను కమిషనర్‌గా నియమించి ఫ్రీ హ్యాండ్ఇవ్వడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
చెరువులు కబ్జా చేసి కట్టిన భారీ భవంతులు, ఫాంహౌస్‌లను కూల్చేస్తున్నారు. ఈ విషయంలో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. సిటీ అభివృద్ధిలో కీలకమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, వాటర్‌బోర్డు హెచ్ఓడీ పోస్టులకు సీఎం రేవంత్ సమర్థులైన ఆఫీసర్లను ఆచితూచి ఎంపిక చేసుకున్నట్లు తాజా నియామకాలను బట్టి స్పష్టమవుతోంది. జీహెచ్ఎంసీ ఇన్చార్జి కమిషనర్‌గా తనదైన మార్క్చూపించిన ఆమ్రపాలిని పూర్తిస్థాయి కమిషనర్‌గా నియమించారు. హెచ్ఎండీఏ జాయింట్‌కమిషనర్, గ్రోత్కారిడార్ఎండీ, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ బాధ్యతల నుంచి తప్పించారు.
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్అహ్మద్కు హైదరాబాద్గ్రోత్కారిడార్లిమిటెడ్ మేనేజింగ్డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఔటర్ రింగ్రోడ్పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో గ్రోత్కారిడార్కీలకం కానుంది. ఇక ఎంఎయూడీ ప్రిన్సిపల్సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న దాన కిషోర్‌కు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ప్రక్షాళన, బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని సమర్థుడైన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్దాన కిశోర్‌కు అప్పగించడం విశేషం.
కొన్ని రోజుల కింద మెట్రోవాటర్‌బోర్డు మేనేజింగ్డైరెక్టర్గా ఉన్న సుదర్శన్‌రెడ్డిని మార్చి, ఆయన స్ధానంలో అశోక్‌రెడ్డిని నియమించారు. తాజాగా బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణను తప్పించి ఆయన స్థానంలో నారాయణపేట జిల్లా అడిషనల్కలెక్టర్ మయాంక్ మిట్టల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కోట శ్రీవాత్సవను నియమించారు. ఇలా హైదరాబాద్ రూపురేఖలు మార్చాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అందుకు అనుగుణంగా ఐఏఎస్‌ల టీమ్‌ను నియమించుకోవడంపై చర్చ జరుగుతోంది.