న్యూఢిల్లీ, వెలుగు: స్వాతంత్య్ర సమరయోధునిగా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ- వైస్ ఛాన్స్‌లర్‌గా, బీహార్ గవర్నర్‌గా, రాష్ట్రపతిగా దేశానికి జాకీర్ హుస్సేన్ ఎన్నో సేవలు అందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శనివారం మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్‌రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం హైదరాబాద్ బయలుదేరారు.